నేను ఏ మార్గాన్ని ఎంచుకోవాలి?
నాస్తికులు మరియు సంశయవాదుల సంఖ్యలో పెద్ద పెరుగుదల ఉన్నప్పటికీ చాలా మంది సజీవ దేవుని ఎరిగి మరియు ఆయనయందు విశ్వాసముంచి ఆయన వద్దకు వస్తున్నారు ఈ ప్రయాణంలో, మతాలలో చిక్కుకున్నందున దేవుని యొద్దకు సరైన మార్గం ఏమిటని వారిలో చాలామంది గందరగోళానికి గురవుతున్నారు.
అయితే క్రైస్తవ మతంలో కూడా, సిద్ధాంతపరమైన తేడాల కారణంగా సంఘం అను క్రీస్తు శరీరములో విపరీతమైన విభజనలు జరిగాయి. సరైన క్రైస్తవ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోకపోవడం మరియు లోబడకుండా పోవడమే విభజనకు కారణం అవుతుంది .సిద్ధాంతమే కాదు.
ఈ గుంపు చాలామంది ప్రభువైన యేసుక్రీస్తును నిజమైన రక్షకుడిగా ఎరిగి యున్నారు మరియు పరలోకానికి ఆయన ఏకైక మార్గం అని సత్యాన్ని తెలుసుకున్నారు, కాని విశ్వాసులలో సరైన సహవాసము ఏమిటనే దానిపై చాలా సందేహాలు ఉన్నాయి.
నిజమైన సజీవ దేవుడు ఎవరు ?
స్వర్గం మరియు నరకం ఉందా ?
నేను ఏ సహవాసాన్నికి వెళ్ళాలి ?
సరైన బోధనలను ఏమిటి?
నేను ఏ మార్గాన్ని ఎంచుకోవాలి ?
నిజమైన మార్గం ఏది ?
మీరు ఈ ప్రశ్నలన్నిటితో ఉన్నారా? అప్పుడు, సమాధానాలు తెలుసుకోవడానికి బైబిల్ చదవండి. బైబిల్ మాత్రమే మీ సందేహాలన్నింటినీ తొలగించగలదు,యిర్మియా 29: 13 మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కను గొందురు,మీరు హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తే మీరు అలాగే ఆయనను కనుగొంటారు.,అపో.కార్యములు 17: 11 వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.నకిలీ డబ్బుల నుంచి సరైన డబ్బులని ఎలాగైతే గుర్తించి నకిలీ డబ్బులను వేరు చేస్తామో అలాగే ఈ చివరి కాలంలో కూడా తప్పుడు బోధనలను గుర్తించి మరియు సరైన దేవుని సహవాసంలో మాత్రమే మనము నిలిచి ఉండాలి(ఒప్పుకోవాలి)అందుకోసం మీ హృదయపూర్వకముగా ప్రభువును ప్రార్థించండి మరియు హృదయపూర్వకంగా ప్రభువును ప్రేమించండి మరియు ఆయనను వెదకుతున్నవారికి సరైన ప్రభువును, ఆయన వాక్యాన్ని కనుగొంటారు యోహాను 14: 21